శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Aug 21, 2020 , 15:19:12

తండ్రీకొడుకులపై దుండగుల కాల్పులు

తండ్రీకొడుకులపై దుండగుల కాల్పులు

సమస్తీపూర్‌ : బీహార్‌లోని సమస్తిపూర్‌ జిల్లా ఉజియార్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహిసరి ప్రాంతంలో గురువారం తెలియని దుండగులు తండ్రీకొడుకులపై జరిపిన కాల్పుల్లో తండ్రి మృతి చెందగా కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. మహిసరి గ్రామంలోని 3వ వార్డులో గురువారం సాయంత్రం ఆర్కెస్ట్రా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు వీరేంద్ర పాశ్వాన్‌, రూపేశ్‌ పాల్గొన్నారు. కార్యక్రమంలో వివాదం జరిగి సద్దుమనిగిన కాసేపటికి సమీపం నుంచి దుండగులు వీరిపైకి కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని స్థానికులు చికిత్స నిమిత్తం హుటాహుటిన దవాఖానకు తరలించగా అప్పటికే తండ్రి మృతి చెందారు. కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్‌ బృందం రంగంలోకి దిగిందని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo