శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Aug 16, 2020 , 16:59:41

బస్సు డివైడర్‌ను ఢీకొని వ్యక్తి మృతి.. ముగురికి గాయాలు

బస్సు డివైడర్‌ను ఢీకొని వ్యక్తి మృతి.. ముగురికి గాయాలు

ఫిరోజాబాద్‌ :  ఉత్తర ప్రదేశ్‌ ఫిరోజాబాద్లోని లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఆదివారం తెల్లవారుజామున ప్రైవేట్ బస్సు డివైడర్‌ ఢీకొని మంటలు చేలరేగి వ్యక్తి మృతి చెందగా ముగ్గురికి గాయాలయ్యాయి. శనివారం బీహార్ నుంచి 72 మంది ప్రయాణికులు బస్సు గుజరాత్ బయల్దేరింది. ఆదివారం తెల్లవారుజామున ఉత్తర ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ వద్దకు రాగానే బస్సు అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లడంతో మంటలు చెలరేగాయి.

మంటల్లో చిక్కుకుని బీహార్‌లోని సుపాల్ జిల్లాకు చెందిన విష్ణు రిషిదేవ్‌గా మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారని పోలీసు సూపరింటెండెంట్ రాజేశ్‌ కుమార్ తెలిపారు. మిగిలిన ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు పంపారు. ‘ప్రమాదం జరిగిన సమయంలో అందరం గాఢ నిద్రలో ఉన్నాం. అకస్మాత్తు భారీగా శబ్దం రావడంతో మేల్కొన్నాం. ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సులో పొగ వ్యాపించడంతో దిగి పరిగెత్తాం’. అని రాజేంద్ర అనే ప్రయాణికుడు తెలిపారు.


logo