శుక్రవారం 23 అక్టోబర్ 2020
Crime - Sep 28, 2020 , 12:26:32

రూ.25 కోట్ల విలువైన హెరాయిన్‌ స్వాధీనం

రూ.25 కోట్ల విలువైన హెరాయిన్‌ స్వాధీనం

డిస్పూర్‌ : డ్రగ్స్‌ అక్రమ రవాణాపై అస్సాం పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అరికట్టేందుకు జూన్‌ 26 నుంచి పోలీస్‌ శాఖ ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టింది. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి నాగాలాండ్‌ సరిహద్దులో వ్యక్తి నుంచి 5 కిలోల స్వచ్ఛమైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకొని అతడిని అరెస్టు చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ రూ.25 కోట్ల వరకు ఉంటుందని డీజీపీ భాస్కర్‌ జ్యోతి మహంత తెలిపారు. రాష్ట్రంలో ఇంత భారీగా హెరాయిన్‌ పట్టుబడటం ఇదే తొలిసారని ఆయన పేర్కొన్నారు. నిందితుడిని ఇస్లాయిల్‌ అలీ అనే వ్యక్తిగా గుర్తించారు. జోగిగోపా పోలీసులు అతడిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. డ్రగ్స్‌ను అరికట్టేందుకు పోలీసులు సరిహద్దులతోపాటు అన్నివైపులా నిఘా పెడుతుండటంతో కొన్నిరోజులుగా భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడుతున్నాయి.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo