సోమవారం 28 సెప్టెంబర్ 2020
Crime - Aug 14, 2020 , 14:42:14

ముర్బాద్‌ జలపాతంలో పడి ఒకరు మృతి, మరొకరు గల్లంతు

ముర్బాద్‌ జలపాతంలో పడి ఒకరు మృతి, మరొకరు గల్లంతు

థానే : మహారాష్ట్ర రాష్ట్రం థానే జిల్లాలోని ముర్బాద్ తాలూకాలోని జలపాతంలో ఇద్దరు గల్లంతు కాగా ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైందని పోలీసులు శుక్రవారం తెలిపారు. వివరాలు.. అంబోలి గ్రామానికి చెందిన 12 మంది యువకులు గురువారం మధ్యాహ్నం ఖోపివిలిలోని జలపాతంలో ఈత కొట్టడానికి వెళ్లారు. అందులో ఉమేశ్‌ టుబ్కడ్లే(25), కార్తీక్‌ గాడ్జ్‌ (25)అనే ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు జలపాతంలో పడి గల్లంతు కావడంతో వెంటనే అతడి స్నేహితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

పోలీసులు, రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టగా ఉమేశ్‌ మృతదేహం దొరికిందని, కార్తీక్‌ కోసం వెతుకుతున్నట్లు ముర్బాద్ పోలీస్ స్టేషన్ హౌస్ అధికారి శుక్రవారం తెలిపారు. దీంతో థానే, పాల్ఘర్ జిల్లాల కలెక్టర్లు వానకాలంలో ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి నీటి వనరుల వద్దకు ఎవరినీ అనుమతించవద్దని ఉత్తర్వులు జారీ చేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo