మంగళవారం 26 జనవరి 2021
Crime - Jan 08, 2021 , 17:01:06

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

సిద్దిపేట : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తిమ్మారెడ్డిపల్లి హోటల్స్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్థానికుల కథనం మేరకు..సిద్దిపేట హౌసింగ్ బోర్డుకు చెందిన గడ్డం వెంకటసాయి (22) ద్విచక్ర వాహనంపై హైదరాబాద్‌కు వెళ్తుండగా.. సిద్దిపేట నుంచి వర్గల్‌కు వెళ్తున్న మహీంద్రా బొలెరో డీజిల్ ట్యాంకర్‌ టోల్గెట్‌‌ను తప్పించుకొని కొండపాక మీదుగా తిమ్మారెడ్డిపల్లి హైవే రోడ్ దగ్గర యూటర్న్ తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న108 సిబ్బంది రాజిరెడ్డి, శ్రీనివాస్ కొన ఊపిరితో ఉన్న వెంకటసాయికి ప్రథమ చికిత్స చేసి సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా మర్గమధ్యలో మృతి చెందాడు.


logo