మంగళవారం 26 జనవరి 2021
Crime - Dec 28, 2020 , 09:40:44

ఆగివున్న లారీని ఢీకొన్న కారు.. వ్యక్తి మృతి

ఆగివున్న లారీని ఢీకొన్న కారు.. వ్యక్తి మృతి

ములుగు: జిల్లాలోని తాడ్వాయి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. 163వ జాతీయ రహదారిపై ఆగివున్న లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని దవాఖానకు తరలించారు. మృతుడిని మంగపేట మండలం పోతునూరి శ్రీనివాస్‌గా గుర్తించారు. ఈ ప్రమాదంలో శ్రీనివాస్‌ కుమారుడు, కుమార్తె గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. ముందున్న వాహనం కనిపించకపోవడంతోనే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.


logo