బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Aug 25, 2020 , 07:49:43

కుప్పకూలిన ఐదంతుస్తుల భవనం : ఇద్దరు మృతి.. 17 మందికి గాయాలు

కుప్పకూలిన ఐదంతుస్తుల భవనం :  ఇద్దరు మృతి.. 17 మందికి గాయాలు

రాయ్‌ఘడ్‌ : మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌ జిల్లా మహద్‌ తహసీల్‌ పరిధిలోని కాజల్‌పురాలో ఐదు అంతస్తుల భవనం కుప్పకూలడంతో ఇద్దరు మృతి చెందగా, 17 మందికిపైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. 200 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకున్నట్లు మంత్రి అదితి ఎస్ తత్కరే వెల్లడించారు. హుటాహుటిన మూడు ఎన్డీఆర్ఎఫ్ (జాతీయ విపత్తు ప్రతిస్పందనా దళం) బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు 60 మందినిపైగా రక్షించారు. సహాయక చర్యలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్‌డీఆర్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్‌ను ఆదేశించారు.

‘భవనం కూలిపోవడం విషాదకరం. సహాయ చర్యలను చేపట్టేందుకు మరింత మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని ఘటనా స్థలానికి పంపుతున్నాం. వీలైనంత త్వరగా శిథిలాల కింద ఉన్న వారందరినీ రక్షిస్తాం. అందరి భద్రత కోసం ప్రార్థిస్తున్న' అని అమిత్ షా ట్వీట్ చేశారు. ‘ప్రత్యేక పరికరాలతో సహాయక చర్యలు చేపట్టేందుకు పూణే నుంచి మూడు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపాం. ఎన్డీఆర్ఎఫ్ మహారాష్ట్ర కమాండెంట్ సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు’ అని ఎన్డీఆర్ఎఫ్‌ డీజీ సత్యనారాయణ ప్రధాన్‌ ట్విట్‌ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo