ఆదివారం 24 జనవరి 2021
Crime - Dec 18, 2020 , 16:16:40

బస్సులోయలో పడి మహిళ మృతి.. 70 మందికి గాయాలు

బస్సులోయలో పడి మహిళ మృతి.. 70 మందికి గాయాలు

ఇండోర్‌ : మధ్యప్రదేశ్‌లోని ధార్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలస కూలీలతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడి మహిళ మృతి చెందగా 70 మందికిపైగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి వలసకూలీలు గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్‌కు వెళ్తుండగా జాతీయ రహదారి-47పై గురువారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన జరిగింది.

స్థానికులు బస్సు అద్దాలను పగులగొట్టి క్షతగాత్రులను బయటకు తీసుకువచ్చి సమీప ఆసుపత్రులకు తరలించారు. మద్యం మత్తులో  డ్రైవర్‌ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో 40 అడుగుల లోతు లోయలోకి దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని రాజ్‌ఘఢ్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌చార్జి లోకేశ్‌ భదోరియా చెప్పారు.  ప్రమాదంలో బస్సు పూర్తిగా ధ్వంసమైందని, గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo