బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Aug 25, 2020 , 18:46:45

రూ. కోటి విలువైన గంజాయి స్వాధీనం

రూ. కోటి విలువైన గంజాయి స్వాధీనం

భద్రాద్రి కొత్తగూడెం : ఐచర్‌ కంటైనర్‌, కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.కోటి విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. భద్రాచలం పోలీసు స్టేషన్‌లో విలేకరులకు ఆయన వివరాలు వెల్లడించారు. మంగళవారం ఉదయం భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో సీఐ వినోద్, ఎస్‌ఐ మహేశ్‌ సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేపట్టారు. ఐచర్ వాహనం, కారులో గంజాయి ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కారులో 27 కేజీలు, ఐచర్ కంటైనర్లో 609 కేజీల గంజాయి పట్టుబడిందని, మార్కెట్‌లో దీని విలువ రూ. కోటి వరకు ఉంటుందని ఏఎస్పీ తెలిపారు. హర్యానా, రాజస్థాన్‌ రాష్ట్రాలకు చెందిన నరేష్ కుమార్, ముకేశ్ కుమార్, భల్వీర్, జితేందర్ శర్మను అదుపులోకి తీసుకున్నారు.  సరిహద్దులో తనిఖీలను ముమ్మరం చేశామని, నిషేధిత వస్తువులు తరలిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో  భద్రాచలం పట్టణ సీఐ వినోద్, ఎస్ఐ బి.మహేశ్‌ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo