బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Sep 16, 2020 , 17:27:43

రూ . కోటి 20 లక్షల విలువచేసే గంజాయి స్వాధీనం

రూ . కోటి 20 లక్షల విలువచేసే గంజాయి స్వాధీనం

అమరావతి : విజయనగరం జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అరకు నుంచి ఒడిశా రాష్ట్రం రాయఘడ కు అక్రమంగా తరలిపోతున్న గంజాయిని కొమరాడ పోలీసులు పట్టుకున్నారు. కొమరాడ వద్ద రహదారి గోతుల కారణంగా ట్రాఫిక్ నిలిచిపోవటంతో లారీలో గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సుమారు రూ . కోటి 20 లక్షల రూపాయల విలువ చేసే 675 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారుపోలీసులు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo