బుధవారం 02 డిసెంబర్ 2020
Crime - Oct 23, 2020 , 16:56:59

పాయువులో బంగారం.. ప‌ట్టుకున్న అధికారులు

పాయువులో బంగారం.. ప‌ట్టుకున్న అధికారులు

చెన్నై: బ‌ంగారాన్ని అక్ర‌మంగా ర‌వాణా చేస్తూ చెన్నై అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో మ‌రో వ్య‌క్తి ప‌ట్టుబ‌డ్డాడు. ఎయిర్‌పోర్టులో ఒక ప్ర‌యాణికుడి న‌డ‌కతీరు అనుమానాస్ప‌దంగా క‌నిపించ‌డంతో చెన్నై ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు అధికారులు అతడిని లోప‌లికి తీసుకెళ్లి త‌నిఖీ చేశారు. పాయువులో పేస్ట్ రూపంలో ఉన్న‌ 215 గ్రాముల బంగారాన్ని దాచుకున్న‌ట్లు గుర్తించి బ‌య‌టికి తీయించారు. నిందితుడు ఆ బంగారం పేస్టును ఒక చిన్న ట్యూబులో ఉంచి పాయువులో దాచిపెట్టాడు. అంతేగాక నిందితుడి ప్యాంటు జేబులో 50 గ్రాముల బరువుగ‌ల‌ మ‌రో రెండు బంగారం ముక్క‌ల‌ను గుర్తించారు. అనంత‌రం అధికారులు మొత్తం 265 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ విష‌యాన్ని చెన్నై క‌స్ట‌మ్స్ క‌మిష‌న‌ర్ మీడియాకు వెల్ల‌డించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.