మంగళవారం 11 ఆగస్టు 2020
Crime - Jul 05, 2020 , 11:18:10

విమానం ఎక్కే సమయంలో గుండెపోటు.. వృద్ధురాలు మృతి

విమానం ఎక్కే సమయంలో గుండెపోటు.. వృద్ధురాలు మృతి

రంగారెడ్డి : శంషాబాద్‌ విమానాశ్రయంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. విమానం ఎక్కే సమయంలో ఓ వృద్ధురాలు గుండెపోటుకు గురైంది. వృద్ధురాలు సూడాన్‌ వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చింది. అనారోగ్యంతో ఉన్న వృద్ధురాలు వీల్‌చైర్‌లోనే గుండెపోటుకు గురై కుప్పకూలింది. ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలిని సూడాన్‌కు చెందిన హయీబా మహ్మద్‌ తాహా అలీ(62)గా గుర్తించారు. గత ఏడు నెలలుగా హైదాబాద్‌లో క్యాన్సర్‌ వ్యాధికి చికిత్స పొందుతోంది. 


logo