హైదరాబాద్ : డేటింగ్ మాయలో పడి ఓ వృద్ధుడు రూ.11 లక్షలు కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. సరదాగా చాటింగ్ చేసిన వృద్ధుడిని నేరగాళ్లు మోసగించి రూ.11 లక్షలు కాజేశారు. మరింత డబ్బు కోసం ఒత్తిడి చేయడంతో మోసపోయినట్లుగా గుర్తించిన వృద్ధుడు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.