ఆదివారం 24 జనవరి 2021
Crime - Dec 19, 2020 , 22:05:43

రోడ్డు ప్రమాదంలో వృద్దుడు మృతి

రోడ్డు ప్రమాదంలో వృద్దుడు మృతి

పెద్దపల్లి : అతివేగంగా వచ్చిన వాహనం రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టడంతో మృతి చెందాడు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొంపల్లి గ్రామానికి చెందిన మాచర్ల రామచంద్రం (70) ఉదయం వ్యక్తిగత పనులపై జిల్లా కేంద్రానికి వచ్చాడు. పెద్దపల్లి అయ్యప్ప గుడి దగ్గర రోడ్డు దాటుతుండగా బస్టాండ్ వైపు వెళ్తున్న టాటామ్యాజిక్‌ (AP 20 టీవీ 0195) ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి.

 బాధితుడిని స్థానికులు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి కరీంనగర్ ప్రభుత్వ దవాఖాన తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య  అమృతమ్మ ఫిర్యాదు మేరకు వాహనం డ్రైవర్ మార్క సదయ్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo