బుధవారం 27 జనవరి 2021
Crime - Oct 11, 2020 , 14:40:02

ఇల్లు కూలి ఇద్దరు మృతి.. పాతబస్తీలో విషాదం

ఇల్లు కూలి ఇద్దరు మృతి.. పాతబస్తీలో విషాదం

హైదరాబాద్‌ : పాతబస్తి హుస్సేని ఆలం పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వర్షానికి పాత రేకుల ఇల్లు కూలగా.. ఏడుగురు గాయపడ్డారు. దవాఖానకు తరలించగా.. ఇద్దరు మహిళలు చికిత్స పొందుతూ మృత్యవాత పడ్డారు. మరో ఐదురుగు హాస్పిటల్‌ చికిత్స పొందుతున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్షానికి పాత ఇల్లు కూలడంతో ఏడుగురు శిథిలాల్లో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్నిహాపక సిబ్బంది ఏడుగురిని వెలికి తీశారు. వారిని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. ఇందులో ఇద్దరు మహిళలు తీవ్ర గాయాలు కావడంతో మృత్యువాతపడ్డారు. మరో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. కాగా, వర్షానికే పాత రేకుల ఇల్లు కూలినట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలిలో ఉన్న భవనాన్ని అధికారులు కూల్చివేస్తున్నారు. సహాయ చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo