శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Sep 01, 2020 , 17:33:29

పోలీసు కస్టడీలో ట్రక్‌ డ్రైవర్‌ ఆత్మహత్య

పోలీసు కస్టడీలో ట్రక్‌ డ్రైవర్‌ ఆత్మహత్య

కొరాపుట్ : గంజాయి రవాణా కేసులో అరెస్టయిన ట్రక్ డ్రైవర్ పోలీసుల కస్టడీలో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని ఒడిశాలోని కొరాపుట్‌ జిల్లాకు చెందిన గోపాల్‌రామ్‌ పశ్వాన్‌ (48)గా గుర్తించారు. ట్రక్కులో అక్రమంగా గంజాయి రవాణా చేస్తుండగా గోపాల్‌ రామ్‌ను జైపూర్ సదర్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. 8 క్వింటాళ్ల గంజాయితోపాటు ట్రక్కును సీజ్‌ చేసి అతడిని పోలీసు కస్టడీలో ఉంచారు.

మంగళవారం తెల్లవారుజామున వాష్‌రూమ్‌కు వెళ్లిన గోపాల్‌ బెడ్‌షీట్‌తో పైకప్పుకు ఉరేసుకున్నాడు. గుర్తించిన సిబ్బంది అతడిని దవాఖానకు తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) మార్గదర్శకాల ప్రకారం దర్యాప్తు చేస్తున్నట్లు గుంతపల్లి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్‌డీపీఓ) తెలిపారు. మంగళవారం డ్రైవర్ కుటుంబ సభ్యుల సమక్షంలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo