సోమవారం 18 జనవరి 2021
Crime - Dec 23, 2020 , 12:32:55

ఐదేళ్ల బాలిక డెడ్‌బాడీపై లైంగిక‌దాడి

ఐదేళ్ల బాలిక డెడ్‌బాడీపై లైంగిక‌దాడి

భువ‌నేశ్వ‌ర్ : ఓ కామాంధుడు అభం శుభం తెలియ‌ని అమాయ‌క చిన్నారిపై చెల‌రేగిపోయాడు. బాలిక‌ను ఒంట‌రిగా నిర్బంధించి అత్యాచారం చేసేందుకు య‌త్నించాడు. చిన్నారి త‌ప్పించుకునేందుకు య‌త్నించింది. దీంతో ఆ బాలిక‌ను హ‌త్య చేసి ఆ త‌ర్వాత వికృత చ‌ర్య‌కు పాల్ప‌డ్డాడు. మృత‌దేహంపై లైంగిక‌దాడి చేసి పైశాచిక ఆనందం పొందాడు. ఈ దారుణ ఘ‌ట‌న ఒడిశాలోని ఓ గ్రామంలో వెలుగు చూసింది.

ఈ ఏడాది జులై 13వ తేదీన రాత్రి ఓ యువ‌కుడు పోర్న్ వీడియోలు చూశాడు. దీంతో త‌న కోరిక‌ల‌ను అదుపులో ఉంచుకోలేక‌పోయాడు. ఆ మ‌రుస‌టి రోజు త‌న ఇంటికి స‌మీపంలోని ఓ ఐదేళ్ల బాలిక‌ను అప‌హ‌రించాడు. ఇంట్లోకి తీసుకువ‌చ్చి అత్యాచారం చేసేందుకు య‌త్నించ‌గా బాలిక ప్ర‌తిఘ‌టించింది. అనంత‌రం ఆ బాలిక‌ను హ‌త్య చేసి లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. ఆ త‌ర్వాత బాలిక మృత‌దేహాన్ని స్థానికంగా ఉన్న చెరువులో ప‌డేశాడు. జులై 23వ తేదీన బాలిక మృత‌దేహం ల‌భ్య‌మైంది. అయితే మృతురాలి త‌ల్లిదండ్రులు త‌మ‌కు న్యాయం చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఒడిశా అసెంబ్లీ ముందు ఆందోళ‌న‌కు దిగారు. దీంతో ఈ ఘ‌ట‌న వెలుగు చూసింది. 

నా కుమారుడు అమాయ‌కుడు 

ఐదేళ్ల బాలిక‌పై త‌న కుమారుడు ఎలాంటి అఘాయిత్యానికి పాల్ప‌డ‌లేద‌ని నిందితుడి త‌ల్లి స్ప‌ష్టం చేసింది. త‌న కుమారుడికి రూ. 5 ల‌క్ష‌లు ఇచ్చి నేరం అంగీక‌రించేలా పోలీసులు అత‌న్ని ఒప్పించారు. ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం త‌న కుమారుడిని వేధింపుల‌కు గురి చేస్తుంద‌ని ఆమె పేర్కొంది. సంబంధం లేని కేసులో త‌న కుమారుడిని ఇరికించార‌ని త‌ల్లి చెప్పింది. 

మొత్తానికి ఈ కేసులో నిందితుడిని పోలీసులు సోమ‌వారం అదుపులోకి తీసుకున్నారు. డిసెంబ‌ర్ 24వ తేదీ వ‌ర‌కు పోలీసులు అత‌డిని విచారించనున్నారు. 

ఇవి కూడా చ‌ద‌వండి.. 

బాత్రూంలో ప్రసవించిన మహిళ.. శిశువు మృతి
పీవీ దేశ చ‌రిత్ర‌లో నిలిచిపోతారు : సీఎం కేసీఆర్
జల్లికట్టుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి