శుక్రవారం 22 జనవరి 2021
Crime - Sep 30, 2020 , 13:53:37

బ్రేవరీ అవార్డు అందుకున్న బాలిక అదృశ్యం

బ్రేవరీ అవార్డు అందుకున్న బాలిక అదృశ్యం

కేంద్రపారా : ఈ ఏడాది జాతీయ ధైర్యసాహసాలకు అవార్డు అందుకున్న 16 ఏళ్ల బాలిక సోమవారం నుంచి జంబూ సముద్ర పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నిపానియా గ్రామం నుంచి అదృశ్యమైంది. తనను పెళ్లి చేసుకోవాలనుకున్న ఓ యువకుడు తనను అపహరించి ఉంటాడని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తన గ్రామానికి సమీపంలోని పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని జనవరిలో మరో స్థానిక బాలికతో కలిసి జాతీయ శౌర్య పురస్కారాన్ని అందుకుంది. వీరిద్దరికీ భువనేశ్వర్‌లో ఆగస్టు 29న బిజూ పట్నాయక్ బ్రేవరీ అవార్డు కూడా లభించింది.

బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు సాలియో గ్రామానికి చెందిన నిందితుడు ప్రదీప్ ఖాడాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు జంబూ సముద్ర ఐఐసీ మహేశ్వర్ సేథీ తెలిపారు. తన కూతురు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని పేర్కొన్నారు. బాలిక ఆచూకీ కోసం పలు చోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి సాకుతో ప్రదీప్ తనను ప్రలోభపెట్టి ఉండొచ్చని ఆమె తండ్రి ఆరోపించారు. తన కుమార్తెను మహానది నది మీదుగా పడవలో బలవంతంగా తీసుకెళ్లి ఉండవచ్చునని తెలిపారు. దీంతో సదరు యువకుడిపై 366, 363, 368, 506 సెక్షన్లతో పాటు పోక్సో చట్టం 2012 సెక్షన్‌ 8 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo