బుధవారం 30 సెప్టెంబర్ 2020
Crime - Aug 07, 2020 , 15:06:27

అటవీశాఖ అధికారి అరెస్టు..

 అటవీశాఖ అధికారి అరెస్టు..

పూరి : ఒడిశా రాష్ట్రంలో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన అటవీశాఖ అధికారిని విజిలెన్స్‌ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. పూరి అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (ఏసీఎఫ్), వన్యప్రాణి విభాగం అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న ప్రశాంత్ కుమార్ స్వైన్‌కు ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు విజిలెన్స్‌ అధికారులకు సమాచారం అందింది. దీంతో ఆగష్టు 5న పూరిలోని ఆయన కార్యాలయంతోపాటు భువనేశ్వర్‌లోని ఆయనకు చెందిన మూడంతుల భవనం, పూరిలోని అద్దె ఇల్లు, స్వగ్రామం సిస్లోలోని ఇంట్లో, పీఎస్-బలియంటా జిల్లా ఖోర్దాలోని ఇండ్లతోపాటు ధెంకనలోని బంధువుల ఇండ్లలో భువనేశ్వర్‌ డివిజన్ విజిలెన్స్‌ అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. స్వైన్ దాదాపు రూ. 1.16 కోట్ల అక్రమాస్తులు కూడగట్టినట్లు కటక్ విజిలెన్స్ డైరెక్టర్ కార్యాలయం ప్రకటించింది. ఆస్తులను సీజ్‌ చేసి అతడిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.logo