సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Aug 17, 2020 , 08:28:48

400 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్టు

400 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్టు

గజపతి : ఒడిశా గజపతి జిల్లాలో అక్రమంగా వాహనంలో తరలిస్తున్న సుమారు 400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేసినట్లు సోమవారం పోలీసులు తెలిపారు. ఉదయం మోహనా ప్రాంతంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అనుమానం వచ్చి ఉల్లిపాయల లోడుతో వెళ్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా గంజాయి పట్టుబడింది. రూ.30 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకొని అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరి పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు జిల్లాలోని ఉదయగిరి ప్రాంతం నుంచి ఉత్తర ప్రదేశ్లోని వారణాసికి గంజాయిని తరలిస్తున్న గుర్తించారు. గత నెల జిల్లాలో వెయ్యి కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేశారు. ఇక్కడి కొందరు యువకులు సులువుగా డబ్బు సంపాదించేందుకు గంజాయిని పలు ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తున్నట్లు పేర్కొన్నారు.


logo