ముంబై : సంచలనం సృష్టించిన ముంబై పోర్న్ రాకెట్లో శిల్పాశెట్టి పాత్రపై పోలీసులకు ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు లభించలేదు. శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ఈ కేసులో జులై 19న ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పోర్న్ రాకెట్లో శిల్పాశెట్టికి ప్రమేయం ఉందనే ఎలాంటి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌తో పాటు ఆర్ధిక ఆధారాలు కానీ పత్రాలు కానీ లభించలేదని పోలీసులు పేర్కొన్నారు.
అశ్లీల కంటెంట్ అప్లోడ్ చేస్తున్న యాప్‌లో శిల్పాకు ఎలాంటి ప్రమేయం లేదని వెల్లడైనట్టు తెలిసింది. బాధితులు, నిందితుడి స్టేట్మెంట్లో ఎక్కడా ఆమె పేరు, పాత్ర వెల్లడికాలేదు. రాజ్‌కుంద్రా కంపెనీ వయాన్లో డైరెక్టర్ పదవికి 2020లో ఆమె ఎందుకు వైదొలిగారనే కోణంలో ముంబై పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. ఏడాది కిందటి వరకూ ఆమె డైరెక్టర్‌గా వ్యవహరించిన వయాన్ కంపెనీల ఆవరణలోనే అశ్లీల కంటెట్‌ను యాప్‌లోకి అప్లోడ్ చేశారని భావిస్తుండగా గత ఏడాది ఆమె కంపెనీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు.