మంగళవారం 27 అక్టోబర్ 2020
Crime - Oct 18, 2020 , 21:07:34

గుడ్డు కూర వండలేదని స్నేహితుడి హత్య

గుడ్డు కూర వండలేదని స్నేహితుడి హత్య

డిన్నర్‌లోకి గుడ్డు కూర వండలేదన్న కోపంతో స్నేహితుడిని రాడ్‌తో కొట్టి చంపాడు ఓ వ్యక్తి. స్నేహితుడి ముందు అవమానించాడన్న ఆగ్రహంతో స్నేహితుడని చూడకుండా రాడ్‌తో కొట్టడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ పట్టణంలోని మంకాపూర్‌ ప్రాంతంలో జరిగింది.

నాగ్‌పూర్‌ మంకాపూర్‌కు చెందిన గౌరవ్‌ గైక్వాడ్‌, బనారసీ ఇద్దరు స్నేహితులు. రాత్రికి మందుపార్టీ చేసుకుందామని ప్లాన్‌ చేశారు. తీరా రాత్రి మద్యం సేవిస్తున్న సమయంలో గుడ్డు కూర ప్రస్తావన రావడంతో.. ఎక్కడున్నదని బనారసీని గైక్వాడ్‌ ప్రశ్నించాడు. గుడ్డు కూర వండలేదని సమాధానం ఇవ్వడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. దాంతో మద్యం మత్తులో ఉన్న గౌక్వాడ్‌ ఇనుపరాడ్‌తో బనారసీ తలపై బాదాడు. దాంతో తీవ్రంగా గాయపడిన బనారసీ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మంకాపూర్‌ పోలీసులు నిందితుడు గౌరవ్‌ గైక్వాడ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo