శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Aug 18, 2020 , 14:12:08

పేలుడు పదార్థాలు తిని గాయపడిన ఆవు

పేలుడు పదార్థాలు తిని గాయపడిన ఆవు

కోయంబత్తూర్ (తమిళనాడు) : కోయంబత్తూరులోని మెట్టుపాలయంలో అడవి పందులను చంపడానికి వేటగాళ్లు పెట్టిన నాటు బాంబును తిని ఆవు గాయపడింది. ఈ సంఘటన శనివారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జాఫర్‌ అలీ అనే రైతుకు చెందిన ఆవు రెండు రోజులుగా కనబడడం లేదు. ఓ రోజు ఊరిబయట ఆవు కనపడగా దాన్ని పరిశీలిస్తే నోటి నిండా గాయాలతో తీవ్ర అనారోగ్యానికి గురై ఉందని రైతు తెలిపాడు. వెంటనే ఆవును దవాఖానకు తరలించి మెట్టుపాలయం అటవీ శ్రేణి కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు జాఫర్‌ అలీ తెలిపాడు. డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ఈ ఘటనపై విచారణ చేపడుతున్నామన్నారు. అడవి పందుల కోసం నాటు బాంబులు పెట్టిన వ్యక్తులను గుర్తించే పనిలో ఉన్నామని ఆయన పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా ఇలాంటి సంఘటనే ఒకటి జూలై 21న కర్ణాటకలోని మైసూరు హెచ్డి కోటే సమీపంలో జరిగింది. అడవి పందుల కోసం పెట్టిన బాంబు తిని నరసింహ గౌడ్‌ అనే రైతుకు చెందిన ఆవు గాయపడింది. అదేవిధంగా మే 27న కేరళ పాలక్కాడ్ జిల్లాలో ఏనుగు పేలుడు పదార్థాలతో నిండిన పండు తిని మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo