శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Aug 29, 2020 , 08:20:50

ఎంపీ అర్వింద్‌ చెవిలో ‘కమలం’!

ఎంపీ అర్వింద్‌ చెవిలో ‘కమలం’!

హైదరాబాద్‌: కక్కలేక..మింగలేక.. అన్న చందంగా మారింది నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ పరిస్థితి. కేంద్ర పథకమంటూ ఎంపీ కేకేను బురిడి కొట్టించాలని చూడగా చివరినిమిషంలో అప్రమత్తమై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే తరహాలో చేసిన మోసానికి నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ అడ్డంగా బుక్కయినట్లు తెలుస్తున్నది. కేసులో నిందితులు మహేశ్‌, సంజీవ్‌ జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. 

ఎంపీ అర్వింద్‌కు ఇదే తరహాలో ఫోన్‌ కాల్‌ వచ్చిందని, ఎంపీ.. తన పీఏ ద్వారా 12 మంది నుంచి డబ్బు వసూలుచేయించి సైబర్‌ నేరగానికి చెల్లించినట్టు తెలిసింది. ఆ తర్వాత తిరిగి డబ్బు వాళ్లకు వాపస్‌ ఇప్పించినట్టు సమాచారం. ‘విషయం’ బయటికొస్తే పరువు పోతుందనే సదరు నేత పోలీసులకు ఫిర్యాదు ఇవ్వలేదన్న విషయాన్ని నిందితుడు చెప్పినట్టుగా పోలీస్‌వర్గాల్లో చర్చ నడుస్తున్నది. 


logo