ఆదివారం 17 జనవరి 2021
Crime - Jan 14, 2021 , 21:48:07

కోడి పందాలు ఆడుతున్న తొమ్మిదిమంది అరెస్టు

కోడి పందాలు ఆడుతున్న తొమ్మిదిమంది అరెస్టు

జ‌గిత్యాల : కోడి పందాలు ఆడుతున్న తొమ్మిదిమంది వ్య‌క్తుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానిక తార‌క‌రామ‌నగర్‌లో కోడి పందాలు ఆడుతున్నార‌న్న స‌మాచారంతో ఎస్ఐ చిరంజీవి తన‌ సిబ్బందితో కలిసి ఆకస్మిక రైడ్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కోడిపందాలు ఆడుతున్న 9 మందిని  అరెస్టు చేశారు. సంఘ‌ట‌నా స్థ‌లం నుంచి రెండు పందెం కోళ్లు, రూ. 32,400 న‌గదు, 5 మొబైల్ ఫోన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.