సోమవారం 25 జనవరి 2021
Crime - Jan 11, 2021 , 13:17:46

నెల కింద‌టే పెండ్లి.. భార్యకు ఉరివేసి చంపిన భ‌ర్త‌

నెల కింద‌టే పెండ్లి.. భార్యకు ఉరివేసి చంపిన భ‌ర్త‌

ముంబై: వాళ్లిద్ద‌రూ నెల కింద‌టే పెండ్లి చేసుకున్నారు. పెండ్ల‌యిన కొన్ని రోజుల‌కే ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి. ఆ గొడ‌వ‌లు మ‌రింత ముదిరి భార్య‌కు భ‌ర్త ఉరివేసి చంపేదాకా వ‌చ్చింది. మ‌హారాష్ట్ర‌లోని పాల్ఘ‌ర్ జిల్లా వ‌సాయ్ ఏరియా తులింజ్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ప‌రారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

వివ‌రాల్లోకి వెళ్తే.. పాల్ఘ‌ర్ జిల్లాకు చెందిన 24 ఏండ్ల యువ‌కుడు స్థానికంగా ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. గ‌త డిసెంబ‌ర్ 7న అదే జిల్లాకు చెందిన 28 ఏండ్ల మ‌హిళ‌ను అత‌డు వివాహం చేసుకున్నాడు. అయితే, పెండ్ల‌యిన కొన్ని రోజుల‌కే ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి. ఎప్ప‌టిలాగే ఆదివారం రాత్రి కూడా ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రుగ‌డంతో భర్త భార్య మెడ‌కు నైలాన్ తాడుతో ఉరిబిగించి చంపేశాడు. 

మృతురాలి సోద‌రుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి త‌ర‌లించి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేప‌ట్టారు.         

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo