ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Sep 13, 2020 , 21:07:30

పెళ్లి జ‌రిగి ఒక్క‌రోజు గ‌డవ‌క‌ముందే.. మృత్యు ఒడికి

పెళ్లి జ‌రిగి ఒక్క‌రోజు గ‌డవ‌క‌ముందే.. మృత్యు ఒడికి

చిత్తూరు : పెళ్లి జ‌రిగి ఒక్క‌రోజు గ‌డవ‌క‌ముందే ఆ యువ‌కుడు మృత్యు ఒడికి చేరుకున్నాడు. బంధువులు, కుటుంబ స‌భ్యుల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతున్న పెళ్లింట విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. 

రోడ్డు ప్ర‌మాదంలో న‌వ వ‌రుడు మృతి చెందిన ఘ‌ట‌న చిత్తూరు జిల్లా రొంపిచ‌ర్ల మండ‌లం చెంచ‌న్న‌గారిప‌ల్లె గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చాంద్‌పాష‌(23)కు నిన్న మ‌ధ్యాహ్నమే పెళ్ల‌య్యింది. నేడు రిసెప్ష‌న్ (వ‌లీమా) ప‌నుల‌పై బ‌య‌టికెళ్లిన చాంద్‌పాష బైక్‌ను మ‌రో వాహ‌నం ఢీకొట్ట‌డంతో తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. స్థానికులు గ‌మ‌నించి ద‌వాఖాన‌కు త‌ర‌లిస్తుండ‌గా మార్గ‌మ‌ధ్యంలో మృతి చెందాడు. వివాహం జ‌రిగిన మ‌రుస‌టి రోజే కాన‌రాని లోకానికి వెళ్లిన పాష మృత‌దేహం వ‌ద్ద కుటుంబ స‌భ్యులు రోధిస్తున్న తీరు స్థానికుల‌ను కంట‌త‌డి పెట్టించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo