శుక్రవారం 15 జనవరి 2021
Crime - Oct 23, 2020 , 16:37:27

మూసాపేట‌లో న‌వ‌జాత శిశువును వ‌దిలేసిన వైనం

మూసాపేట‌లో న‌వ‌జాత శిశువును వ‌దిలేసిన వైనం

హైద‌రాబాద్ : న‌గరంలోని మూసాపేట‌లో గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు న‌వ‌జాత శిశువును వ‌దిలివెళ్లారు. స్థానిక పెట్రోల్‌పంపు స‌మీపంలో ‌శిశువు ఏడుపులు విన్న‌ స్థానికులు ద‌గ్గ‌రికి వెళ్లి చూడ‌గా ఆడ శిశువుగా గుర్తించారు. వెంట‌నే కూక‌ట్‌ప‌ల్లి పోలీసుల‌కు స‌మాచారం అందించారు మొబైల్ పెట్రోల్ వెహిక‌ల్ సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని శిశువును పోలీస్ స్టేష‌న్‌కు తీసుకువెళ్లారు. పాప‌కు స్నానం చేయించి కొత్త బ‌ట్ట‌లు వేశారు. వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా శిశువు ఆరోగ్యంగానే ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. అనంత‌రం పాప‌ను శిశు విహార్ అధికారుల‌కు అప్ప‌గించారు. త‌ల్లిదండ్రులే శిశును ప‌డేసి వెళ్లిఉంటార‌ని పోలీసులు అనుమానం వ్య‌క్తం చేశారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. స‌మీప ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని ప‌రిశీలించ‌డం ద్వారా త‌ల్లిదండ్రుల‌ను గుర్తించే ప‌నిలో ఉన్నారు.