సోమవారం 28 సెప్టెంబర్ 2020
Crime - Aug 20, 2020 , 07:20:16

5 ఏండ్ల బాలికకు తినుబండారాలు ఆశచూపి..

5 ఏండ్ల బాలికకు తినుబండారాలు ఆశచూపి..

ఇండోర్‌ : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ హీరానగర్ ప్రాంతంలో 5 ఏండ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించినట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) నిహిత్ ఉపాధ్యాయ తెలిపారు. హీరానగర్‌లో నివాసముంటున్న వ్యక్తి పక్కింటి బాలికకు స్వీట్లు, తినుబండారాలు ఆశచూపి తనవెంట తీసుకెళ్లాడు.

ఇంట్లో లైంగిక దాడికి పాల్పడుతుండగా బాలిక బంధువులు గమనించగా పారిపోయాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తుండగా బుధవారం పట్టుబడినట్లు డీఎస్పీ ఉపాధ్యాయ పేర్కొన్నారు. ఐపీసీ 376 ఏ, 376 బీతోపాటు లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ (పోక్సో) చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.


logo