శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Sep 08, 2020 , 16:37:33

రియా కార్టె‌ల్‌.. త్వ‌ర‌లో బాలీవుడ్ సెల‌బ్రిటీలకు స‌మ‌న్లు !

రియా కార్టె‌ల్‌..  త్వ‌ర‌లో బాలీవుడ్ సెల‌బ్రిటీలకు స‌మ‌న్లు !

హైద‌రాబాద్‌: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు.. బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ మాఫియాను బ‌య‌ట‌పెట్టింది. సుశాంత్ గ‌ర్ల్‌ఫ్రెండ్ రియా చ‌క్ర‌వ‌ర్తినే ఆ డ్ర‌గ్ కార్టెల్‌ను న‌డిపిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.  రియా సోద‌రుడు శౌవిక్ చ‌క్ర‌వ‌ర్తి తొలుత డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు అంగీక‌రించాడు.  దీంతో ఎన్‌సీబీ అధికారులు ఈ కేసులో కూపీ లాగారు.  ప్ర‌త్యేక ఎన్‌సీబీ అధికారులు రంగంలోకి దిగ‌డంతో.. బాలీవుడ్‌లో పేరుకుపోయిన డ్ర‌గ్స్ మాఫియా ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది.  శౌవిక‌, రియా చ‌క్ర‌వ‌ర్తిలు డ్ర‌గ్స్ దందా చేసిన‌ట్లు విచార‌ణ‌లో ఎన్‌సీబీ అధికారులు గుర్తించారు. ఈ ఇద్ద‌రూ బాలీవుడ్‌లో చాలా  మంది ప్ర‌ముఖుల‌కు మాద‌క‌ద్ర‌వ్యాల‌ను అమ్మిన‌ట్లు తెలుస్తోంది.  ఓ మీడియా క‌థ‌నం ప్ర‌కారం.. సుమారు 25 మంది బాలీవుడ్ టాప్ సెల‌బ్రిటీల‌కు రియా గ్యాంగ్ డ్ర‌గ్స్ అమ్మిన‌ట్లు తేలింది.  ఆ సెల‌బ్రిటీల పేర్ల‌ను కూడా శౌవిక్‌, రియానే వెల్ల‌డించిన‌ట్లు ఎన్‌సీబీ అధికారులు చెబుతున్నారు.  రియా ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న ఎల‌క్ట్రానిక్ డివైస్‌లు, ఫోన్ డేటా ఆధారంగా కూడా సెల‌బ్రిటీల‌తో లింకు ఉన్న‌ట్లు ఎన్‌సీబీ  నిర్ధార‌ణ‌కు వ‌చ్చింది. 

ఎన్‌సీబీకి చెందిన సిట్ పోలీసులు మొత్తం డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంపై ఓ డాక్యుమెంట్ త‌యారు చేసిన‌ట్లు తెలుస్తోంది. మ‌రో ప‌ది రోజుల్లో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంతో లింకు ఉన్న‌ సెల‌బ్రిటీలకు ఎన్‌సీబీ నోటీసులు  జారీ చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు భావిస్తున్నారు. బాలీవుడ్‌లో జ‌రిగే భారీ పార్టీల్లో డ్ర‌గ్స్ వాడుతార‌న్న విష‌యాన్ని కూడా రియా వెల్ల‌డించింది.  ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో డ్ర‌గ్స్ దాందాలో రియా పాత్ర‌పై పూర్తి స‌మాచారాన్ని సేక‌రించిన‌ట్లు తెలుస్తోంది. ఎన్‌సీబీ విచార‌ణ‌లో తాను డ్ర‌గ్స్ తీసుకుంటున్న‌ట్లు రియా అంగీకరించింది. మారిజునాతో పాటు ఇత‌ర ర‌సాయ‌నాల‌ను తీసుకుంటున్న‌ట్లు రియా ఎన్‌సీబీ ముందు అంగీక‌రించిన‌ట్లు ఓ మీడియా క‌థ‌నం పేర్కొన్న‌ది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు చెందిన ప‌వ్‌నా ఫార్మ్‌హౌజ్‌లో ఎన్‌సీబీ అధికారులు సోదాలు చేయ‌నున్నారు. రియాను ఎన్‌డీపీఎస్ చ‌ట్టంలోని 89(సీ), 20(బీ), 27(ఏ), 28, 29 సెక్ష‌న్ల కింద అరెస్టు చేశారు. logo