శనివారం 16 జనవరి 2021
Crime - Jan 02, 2021 , 18:57:04

పొత్తి కడుపులో దాచిన డ్రగ్స్‌ పట్టివేత

పొత్తి కడుపులో దాచిన డ్రగ్స్‌ పట్టివేత

న్యూఢిల్లీ: డ్రగ్స్‌ను పొత్తి కడుపులో దాచి అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. 635.5 గ్రాముల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఒక ఆఫ్ఘన్ జాతీయుడు శనివారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం దిగాడు. అతడి కదలికలు అనుమానంగా ఉండటంతో కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆఫ్ఘన్ జాతీయుడి శరీరాన్ని పరిశీలించగా డ్రగ్స్‌ను పొత్తు కడుపులో దాచినట్లు బయటపడింది. దీంతో వైద్య విధానం ద్వారా వాటిని బయటకు తీశారు. 89 ప్లాస్టిక్ గుళికల్లో ఉన్న మాదకద్రవ్యాలను హెరాయిన్‌గా అనుమానిస్తున్నారు. ఆ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న కస్టమ్స్‌ అధికారులు ఆఫ్ఘన్ జాతీయుడిని అరెస్ట్‌ చేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఆరా తీస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.