శనివారం 23 జనవరి 2021
Crime - Nov 02, 2020 , 09:04:00

ఆగి ఉన్న డీసీఎంను ఢీ కొట్టిన కారు.. ఒకరు మృతి.

ఆగి ఉన్న డీసీఎంను ఢీ కొట్టిన కారు.. ఒకరు మృతి.

నల్లగొండ: కట్టంగూరు మండలం అయిటిపాముల వద్ద సోమవారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. ఖమ్మం నుంచి షాద్‌నగర్‌ వెళ్తున్న కారు ఐటిపాముల వద్దకు రాగానే రోడ్డు పక్కన నిలిపి ఉన్న డీసీఎంను బలంగా ఢీ కొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న దుర్గ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని నార్కట్‌పల్లిలోని కామినేని దవాఖానకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. కారు డ్రైవర్ అజాగ్రత్తతోనే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. కారు ప్రమాద సమయంలో అతి వేగంతో ఉండడంతో బాగా ధ్వంసం అయ్యింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo