ఆదివారం 09 ఆగస్టు 2020
Crime - Jul 03, 2020 , 16:15:30

మ‌హిళ‌ను చంపి.. ఆపై అత్యాచారం

మ‌హిళ‌ను చంపి.. ఆపై అత్యాచారం

ముంబై : ఓ షాపు ఓన‌ర్.. దుకాణానికి వ‌చ్చిన మ‌హిళ‌ను చంపేశాడు. అత‌ను మృత‌దేహాన్ని కూడా వ‌ద‌ల్లేదు. చ‌నిపోయిన ఆమెపై అత్యాచారం చేసి రాక్షాసానందం పొందాడు షాపు ఓన‌ర్. ఈ అమానుష ఘ‌ట‌న మ‌హారాష్ర్ట‌లోని న‌లాసోపారాలో జూన్ 26న చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. 

32 ఏళ్ల మ‌హిళ‌.. త‌న పిల్ల‌ల‌కు బొమ్మ‌లు కొనేందుకు ఓ షాపుకు జూన్ 26న వెళ్లింది. బొమ్మ‌ల ధ‌ర‌ల విష‌యంలో దుకాణ య‌జ‌మానికి, ఆమె మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అత‌ను ఆమెను ప‌క్క‌నే ఉన్న గ‌దిలోకి జుట్టు ప‌ట్టి ఈడ్చుకెళ్లాడు. ఆ త‌ర్వాత గొంతు నులిమి చంపాడు. అంత‌టితో ఆగ‌లేదు.. కామంతో క‌ళ్లు మూసుకుపోయిన అత‌ను.. అత్యాచారం చేసి రాక్ష‌సానందం పొందాడు. 

అయితే మృతురాలి భ‌ర్త పాల వ్యాపారి. ఆమెకు పిల్ల‌లు ఉన్నారు. జూన్ 28న షాపు ప‌క్క‌నే ఉన్న పార్కింగ్ ఏరియాలో నుంచి దుర్వాస‌న రావ‌డంతో.. అక్క‌డ‌కెళ్లి చూడ‌గా మృత‌దేహం క‌నిపించింది. ఆ డెడ్ బాడీ త‌న భార్య‌దే అని పాల వ్యాపారి గుర్తించాడు. 

ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. డెడ్ బాడీ ల‌భ్య‌మైన పార్కింగ్ ప‌క్క‌నే బొమ్మ‌ల షాపు ఉంది. దీంతో అత‌న్ని విచార‌ణ చేయ‌గా.. అస‌లు విష‌యం వెలుగు చూసింది. తానే హ‌త్య చేసి.. అత్యాచారం చేశాన‌ని ఒప్పుకున్నాడు. షాపు ప‌క్క‌న ఉంటున్న గ‌దిలో నిందితుడు ఒక్క‌డే ఉంటున్నాడు. 


logo