ఆదివారం 24 జనవరి 2021
Crime - Dec 11, 2020 , 18:12:36

ప్రియురాలి తమ్ముడు, ఆమె నానమ్మను చంపిన ప్రియుడు

ప్రియురాలి తమ్ముడు, ఆమె నానమ్మను చంపిన ప్రియుడు

ముంబై: ప్రియురాలి తమ్ముడు, ఆమె నానమ్మను ప్రియుడు హత్య చేశాడు. అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో గురువారం ఈ ఘటన జరిగింది. హజారిపహా‌డ్‌కు చెందిన గుంజన్‌కు మోమిన్‌పురాలో నివాసం ఉంటున్న మొయిన్ ఖాన్‌ (22)తో సామాజిక మాధ్యమంలో గత ఏడాది నవంబర్‌లో పరిచయం ఏర్పడింది. తన స్నేహితుడని కుటుంబ సభ్యులకు కూడా ఆమె పరిచయం చేసింది. అయితే వారిద్దరు ప్రేమించుకుంటున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు అనంతరం గ్రహించారు. గుంజన్‌ నుంచి మొబైల్‌ ఫోన్‌ తీసుకుని ఆమెను బంధువుల ఇంటికి పంపారు. కాగా, శుక్రవారం మధ్యాహ్నం గుంజన్‌ ఇంటికి వచ్చిన మొయిన్‌ ఖాన్‌, ఆమె తమ్ముడు యష్‌ (10), నానమ్మ ప్రమీల(70)ను కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మంకాపూర్‌ ప్రాంతంలోని రైల్వే పట్టాల వద్ద అతడి మృతదేహాం లభించిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo