శనివారం 16 జనవరి 2021
Crime - Jan 09, 2021 , 18:37:26

వినూత్నంగా శృంగారంలో పాల్గొనబోయి.. వ్యక్తి మృతి

వినూత్నంగా శృంగారంలో పాల్గొనబోయి.. వ్యక్తి మృతి

ముంబై: వినూత్నంగా శృంగారంలో పాల్గొనబోయిన ఒక వ్యక్తి ఊపిరాడక మరణించాడు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పెండ్లి అయ్యి పిల్లలున్న ఒక మహిళతో 30 ఏండ్ల వ్యక్తికి వివాహేతర సంబంధం ఉన్నది. వారిద్దరు తరచుగా హోటల్‌కు వెళ్లి ఎంజాయ్‌ చేస్తుంటారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఖపర్ఖేడ ప్రాంతంలోని లాడ్జిలో గది తీసుకున్నారు. 

అయితే వినూత్నంగా శృంగారంలో పాల్గొవాలని భావించిన మహిళ ఆ వ్యక్తి చేతులు, కాళ్లను తాడుతో ఒక కుర్చీకి కట్టేసింది. మరో తాడును అతడి మెడకు ఉంచింది. అనంతరం స్నానానికి వెళ్లింది. తిరిగి వచ్చి చూడగా అతడ్ని బంధించిన కుర్చీ కింద పడి ఉన్నది. మెడకు ఉంచిన తాడు బిగుసుకుని ఊపిరాడక ఆ వ్యక్తి అచేతనంగా పడి ఉన్నాడు. గమనించిన ఆమె వెంటనే లాడ్జి సిబ్బందిని పిలిచింది. వారు వచ్చి ఆ వ్యక్తి కట్లు విప్పారు. అతడు మరణించినట్లు భావించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అక్కడకు వచ్చిన పోలీసులు ఆమెను ఆరా తీయగా తమ మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు అంగీకరించింది. దీంతో అతడు ప్రమాదవశాత్తూ మరణించినట్లుగా కేసు నమోదు చేశారు. ఆ వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. లాడ్జి మేనేజర్‌, సిబ్బంది నుంచి స్టేట్‌మెంట్లు సేకరించారు. ఆ మహిళ, మృతుడి సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి