గురువారం 24 సెప్టెంబర్ 2020
Crime - Aug 11, 2020 , 21:10:13

ఆధార్ పొందిన మయన్మార్ జాతీయుడు అరెస్టు

ఆధార్ పొందిన మయన్మార్ జాతీయుడు అరెస్టు

హైదరాబాద్ : అక్ర‌మ‌మార్గంలో ఆధార్‌కార్డు పొందిన మ‌య‌న్మార్ దేశ‌స్తుడిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌రంలో చోటుచేసుకుంది. పాత‌బ‌స్తీలోని కిష‌న్‌బాగ్‌లో ఉంటున్న మ‌హ్మ‌ద్ ఖాదీర్‌(37) మీ సేవా ఏజెంట్ స‌హాయంతో ఆధార్‌కార్డును పొందాడు. బీపీఎల్ కుటుంబాల‌కు రాష్ర్ట ప్ర‌భుత్వం క‌ల్పించే ప్ర‌యోజ‌నాల‌ను పొందేందుకు దీన్ని ఉప‌యోగిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. ఇటువంటి కేసులో గ‌తంలో అరెస్ట్ అయిన కొంత‌మంది వ్య‌క్తులు అందించిన స‌మాచారం ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. త‌దుప‌రి విచార‌ణ నిమిత్తం ఖ‌దీర్‌ను బ‌హ‌దూర్‌పురా పోలీసుల‌కు అప్ప‌గించారు.


logo