మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Aug 05, 2020 , 12:02:59

‘మా అమ్మ చెప్పడంతోనే డబ్బు దొంగిలించా’

‘మా అమ్మ చెప్పడంతోనే డబ్బు దొంగిలించా’

న్యూ ఢిల్లీ : దక్షిణ ఢిల్లీలోని అంబేద్కర్ నగర్ ప్రాంతంలో ఆగి ఉన్న కారులో నుంచి రూ.1.2 లక్షల నగదు ఉన్న బ్యాగును ఓ 12 ఏండ్ల బాలుడు దొంగలించగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. విచారణలో తన తల్లి, అమ్మమ్మ డబ్బు దొంగిలించమని చెప్పడంతోనే తాను దొంగతనం చేసినట్లు తెలిపాడు. దీంతో బాలుడి అమ్మమ్మను పోలీసులు సోమవారం అరెస్టు చేయగా తల్లి పరారీలో ఉన్నట్లు తెలిసింది. 

జూలై 27న బాలుడు రూ.1,20,000 డబ్బున్న బ్యాగును దొంగలించిన తరువాత ఆ ప్రాంతంలోని సీసీఫుటేజి ఆధారంగా బాలుడిని సోమవారం పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి రూ.5 వేలు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ అతుల్ కుమార్ ఠాకూర్ తెలిపారు. బాలుడి తల్లి, అమ్మమ్మ ప్రేరేపించడంతోనే బాలుడు నగదు అపహరించాడని పోలీసులు గుర్తించారు. 

బాలుడి అమ్మమ్మను అరెస్టు చేసిన తరువాత వారి ఇంటి నుంచి 1,05,000 బ్యాగును కూడా స్వాధీనం చేసుకున్నారు. బాలుడి తల్లి పరారీలో ఉండగా ఆమెకోసం వెతుకుతున్నామని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా బాలుడి తండ్రి ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లోని జైలులో శిక్ష అనుభవిస్తున్నట్లు తెలిసింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo