శుక్రవారం 03 జూలై 2020
Crime - Jul 01, 2020 , 08:28:27

గుండెపోటుతో అన్న.. తట్టుకోలేక తమ్ముడు మృతి

గుండెపోటుతో అన్న.. తట్టుకోలేక తమ్ముడు మృతి

హైదరాబాద్‌ : గుండెపోటుతో మరణించిన అన్న మృతదేహాన్ని చూసి తమ్ముడు అక్కడిక్కడే కుప్పకూలి మృతి చెందిన సంఘటన శంశాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని సిద్ధాంతిలో చోటుచేసుకుంది. సిద్ధాంతికి చెందిన రాచమల్ల సుదర్శన్‌(55) జీహెచ్‌ఎంసీలో స్విమ్మింగ్‌ కోచ్‌గా పని చేస్తున్నాడు. గతంలోనూ ఓ సారి గుండెపోటు రావడంతో ఆపరేషన్‌ చేయించుకున్నాడు. ఈ నెల 29న విధులు ముగించుకొని ఇంచికి వస్తుండగా సుదర్శన్‌ అస్వస్థతకు గురయ్యాడు. ఆ రోజు రాత్రి మరోసారి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు దవాఖానకు తరలిస్తుండగా మృతి చెందాడు.

దీంతో హైదరాబాద్‌లో ఉంటున్న తన తమ్ముడు లవణ్‌(32)కు సమాచారం అందించారు. తల్లిదండ్రులు మరణించిన తర్వాత అన్నీ తానై అండగా ఉన్న అన్న మృతదేహాన్ని చూసి తట్టకోలేకపోయిన లవణ్‌ కప్పకూలి అక్కడిక్కడే ప్రణాలు వదిలాడు. అన్నదమ్ములిద్దరూ ఒకే సారి మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. సుదర్శన్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. లవణ్‌కు వివాహం కాలేదు. logo