శుక్రవారం 22 జనవరి 2021
Crime - Dec 19, 2020 , 11:35:46

కూలీ గొంతును 9 సార్లు కోశారు..

కూలీ గొంతును 9 సార్లు కోశారు..

చెన్నై : త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలో దారుణం జ‌రిగింది. పుదుపేట‌లో రోడ్డుపై న‌డుచుకుంటూ వెళ్తున్న ఓ కూలీని ముగ్గురు వ్య‌క్తులు అత్యంత కిరాత‌కంగా హ‌త్య చేశారు. ఈ దృశ్యాల‌న్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. క‌న్నాగి న‌గ‌ర్‌కు చెందిన సంతోష్ అనే కూలీ రోడ్డుపై న‌డుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌ను ఓ ముగ్గురు వ్య‌క్తులు అడ్డ‌గించారు. అనంత‌రం అందులో ఒక‌రు సంతోష్ గొంతును బ్లేడ్‌తో కోసేశాడు. దీంతో సంతోష్ కింద ప‌డిపోయాడు. మ‌రో వ్య‌క్తి అదే బ్లేడుతో సుమారు 9 సార్లు సంతోష్ గొంతును కోశాడు. సంతోష్ ప్రాణాలు కోల్పోవ‌డంతో అక్క‌డ్నుంచి ముగ్గురు ప‌రారీ అయ్యారు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ముగ్గురిలో ఇద్ద‌రు నిందితుల‌ను అరెస్టు చేయ‌గా, మ‌రొక‌రి కోసం గాలిస్తున్నారు.


logo