మద్యం మత్తులో.. యువకుడి హత్య

వరంగల్ అర్బన్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వరంగల్ నగరంలోని మండిబజార్ ప్రాంతంలో స్నేహితుడి పెండ్లిలో జరిగిన చిన్న గొడవ యువకుడి ప్రాణం తీసింది. మద్యం మత్తులో స్నేహితుడిపై కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కాశీబుగ్గకు చెందిన రేసమల్ల రాజ్‌కుమార్(28)కు శనివారం స్నేహితుడి పెళ్లి బరాత్‌లో యాట ప్రవీణ్ అలియాస్ డీజే లడ్డుతో చిన్న గొడవ జరిగింది. ఆదివారం ఉదయం మిత్రులు ఇద్దరికి సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగిందని అందరూ భావించారు.
ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి నిజాంపుర ప్రాంతంలోని పాన్‌షాపు వద్ద రాజ్‌కుమార్ ఉన్నట్లు తెలుసుకున్న ప్రవీణ్ మద్యం మత్తులో తనతో పాటు మరో ఇద్దరితో వచ్చి కత్తితో దాడి చేసి ద్విచక్రవాహనంపై పారిపోయాడు. స్థానికులు పోలీసులు సమాచారమిచ్చి, రాజ్‌కుమార్‌ను చికిత్స కోసం ఎంజీఎం దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సోమవారం మృతుడి భార్య రేసమల్ల రమ్యశ్రీ ఫిర్యాదు మేరకు ఇంతెజార్గంజ్ సీఐ జీ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి పంచనామా నిర్వహించారు.మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
తాజావార్తలు
- ఇక డేటా ఇన్ఫ్రా, కృత్రిమ మేధపైనే ఫోకస్
- ఆదిపురుష్ లాంఛింగ్‌కు టైం ఫిక్స్..!
- పవన్ కల్యాణ్ చిత్రంలో అనసూయ..?
- విద్యార్థినులకు మొబైల్ ఫోన్లు అందించిన మంత్రి కేటీఆర్
- సెస్, సర్ ఛార్జీలను కేంద్రం రద్దు చేయాలి : మంత్రి హరీశ్ రావు
- సంక్రాంతి హిట్‌పై కన్నేసిన సోనూసూద్..?
- ఫిబ్రవరి 19న తిరుమలలో రథసప్తమి
- చిరంజీవిని చూసే అన్నీ నేర్చుకున్నా: హీరో రోహిత్
- జనం మెచ్చిన గళం గోరటి వెంకన్నది
- శెభాష్...సిరాజ్: మంత్రి కేటీఆర్