శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Jun 17, 2020 , 11:35:35

మద్యం మత్తులో స్నేహితుడి హత్య

మద్యం మత్తులో స్నేహితుడి హత్య

రామగుండం : మద్యం మత్తులో స్నేహితుడిని ఓ యువకుడు హత్య చేసిన ఘటన అంతర్గాం మండలం గోయల్‌వాడలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాలు.. గోయల్‌వాడకు చెందిన మామిడాల అనిల్‌, నేరెళ్ల చందు (27) స్థానికంగా కుల వృత్తులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు యువకులు స్నేహితులు. మంగళవారం అనిల్‌ ఇంట్లో అతడితో పాటు  చందు, అనిల్‌ తండ్రి శంకరయ్య కలిసి మద్యం సేవించారు. మద్యం తాగుతూ అనిల్‌, చందుల మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది.  శంకరయ్య వారిని ఆపేందుకు ప్రయత్నించగా అనిల్‌ అతడిని బయటికి పంపాడు. ఈ నేపథ్యంలో గొడవ మరింత ముదరడంతో అనిల్‌ రోకలి బండతో చందు తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరి మధ్య ఏ విషయంపై గొడవ జరిగిందనేది తెలియాల్సి ఉంది. ఘటనా స్థలాన్ని సీఐ కరుణాకర్‌రావు పరిశీలించారు. ప్రస్తుతం అనిల్‌ పరారీలో ఉన్నాడు. చందు తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 


logo