గురువారం 13 ఆగస్టు 2020
Crime - Jul 02, 2020 , 17:51:07

మేడ్చల్ జిల్లాలో ఆరేండ్ల చిన్నారి దారుణ హత్య

మేడ్చల్ జిల్లాలో  ఆరేండ్ల చిన్నారి దారుణ హత్య

మేడ్చల్ : చేయని నేరానికి ఓ ఆరేండ్ల బాలిక బలైన విషాద ఘటన జిల్లాలోని పోచారంలో చోటు చేసుకుంది. తనతో పరిచయమమున్న మహిళ మరో వ్యక్తితో చనువుగా ఉండటాన్ని ఆ యువకుడు తట్టుకోలేక పోయాడు. సదరు మహిళపై కోపాన్ని ఆమె కూతురు ఆధ్యపై చూపించాడు. చిన్నారిని అత్యంత పాశవికంగా గొంతు కోసి చంపేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసుల కథనం ప్రకారం..యాదాద్రి జిల్లా భువనగిరి ప్రాంతానికి చెందిన కళ్యాణ్, అనూష దంపతులు. వీరు దాదాపు రెండు సంవత్సరాలుగా ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఇస్మాయిల్ ఖాన్ గూడ విహారి హోమ్స్ లో నివాసం ఉంటున్నారు. వీరికి ఆరేండ్ల కూతురు ఆద్య ఉంది. 

అనూషకు కరుణాకర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అయితే అనూష కొద్ది రోజులుగా కరుణాకర్ ను పట్టించుకోకపోవడంతో కోపం పెంచుకున్న అతడు ఆధ్యను అతి కిరాతకంగా సర్జికల్ బ్లేడ్ తో గొంతు కోసి చంపేశాడు. విషయం తెలుసుకొన్న మల్కాజిగిరి ఏసీపీ నర్సింహా రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

 logo