మంగళవారం 01 డిసెంబర్ 2020
Crime - Oct 22, 2020 , 17:46:51

ఏసీబీకి పట్టుబడిన మున్సిపల్ కమిషనర్

ఏసీబీకి పట్టుబడిన మున్సిపల్ కమిషనర్

మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ వడ్డే సురేందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ కాంట్రాక్టర్ వద్ద రూ. 1.65 లక్షలు లంచంగా తీసుకుంటూ..ఏసీబీకి చిక్కారు. ఓ పనికి సంబంధించి బిల్లులు చెల్లించేందుకు గాను కాంట్రాక్టర్ నుంచి కమిషనర్ సురేందర్ రూ. 11 లక్షలు లంచం డిమాండ్ చేయగా..ఇవాళ రూ. 1.65 లక్షలు లంచంగా ఇస్తుండగా మాటు వేసి ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.