మంగళవారం 01 డిసెంబర్ 2020
Crime - Oct 24, 2020 , 16:20:39

ట్రాఫిక్‌ పోలీస్‌ చెంప చెళ్లుమనిపించిన మహిళ

ట్రాఫిక్‌ పోలీస్‌ చెంప చెళ్లుమనిపించిన మహిళ

ముంబై: ఒక మహిళ ట్రాఫిక్‌ పోలీస్‌ చెంప చెళ్లుమనిపించింది. మహారాష్ట్రలోని ముంబైలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. మోషిన్‌ షేక్‌ (32), సాంగ్రికా తివారీ (29) కలిసి బైక్‌పై వెళ్తున్నారు. కల్బదేవి ప్రాంతంలోని సుర్తి హోటల్ సమీపంలో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌  ఏక్‌నాథ్‌ పార్టే వారి బైక్‌ను ఆపారు. హెల్మెట్ ధరించకపోవడంపై జరిమానా విధించారు. మరోవైపు ట్రాఫిక్‌ కానిస్టేబుల్ ఏక్‌నాథ్‌ తనను తిడుతున్నారంటూ సాంగ్రికా తివారీ యూనిఫాంలో ఉన్న ఆయనను పట్టుకుని పలుమార్లు చెంప చెళ్లుమనిపించారు. కాగా ఆమె స్నేహితుడు మోషిన్‌ షేక్‌ తన మొబైల్‌లో దీనిని వీడియో తీశాడు. ఇంతలో మిగతా పోలీసులు జోక్యం చేసుకుని  ఏక్‌నాథ్‌ను కాపాడారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై చేయి చేసుకోవడం, విధులకు ఆటకం కల్పించారన్న ఆరోపణలతో వారిద్దరిని అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు ఈ వీడియో సామాజిక మాథ్యమాల్లో వైరల్‌ అయ్యింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.