గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Jul 07, 2020 , 16:43:09

మైనర్‌ బాలిక కిడ్నాప్‌.. రక్షించిన పోలీసులు

మైనర్‌ బాలిక కిడ్నాప్‌.. రక్షించిన పోలీసులు

ముంబై : సోషల్‌ మీడియాలో మైనర్‌ బాలికతో పరిచయం పెంచుకొని ఆమెను నమ్మించి అపహరించిన వ్యక్తితోపాటు సహకరించిన మరో నలుగురుని అరెస్టు చేసినట్లు ముంబై పోలీసులు  మంగళవారం తెలిపారు. ముంబై నగరంలోని ఓ ప్రాంతంలో నివాసముండే బాలిక(13)కు అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో సోషల్‌ మీడియాలో పరిచయం ఏర్పడింది. బాలికను నమ్మించిన అతడు మధ్యప్రదేశ్ నుంచి మరో నలుగురిని రప్పించి వాహనంలో ఆమెను అపహరించాడు. కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తులో బాలిక నివాసముండే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో సోషల్‌ మీడియాలో తరచూ చాటింగ్‌ చేస్తున్నట్లు గుర్తించారు. నిందితులు రాజస్థాన్‌లోని జాలవర్‌, రాజ్‌ఘర్‌ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్‌కు వినియోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని, బాలికను క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చామని పోలీసులు తెలిపారు. 


logo