ముంబై: పాకిస్థాన్‌లో తలదాచుకున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు అజీమ్ భౌ అలియాస్ మొహమ్మద్ అజీమ్ అబూ సలీమ్‌ను ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అరెస్ట్ చేసింది. అతడు దోపిడీలు, మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌లో పాల్గొన్నట్లు ఆరోపించింది. అజీమ్‌పై అనేక పోలీస్ స్టేషన్లలో దోపిడీ, లూఠీతోపాటు పలు రకాల కేసులు నమోదయ్యాయని ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వెల్లడించింది.