సోమవారం 28 సెప్టెంబర్ 2020
Crime - Jun 28, 2020 , 11:31:20

ముగ్గురు పిల్ల‌ల గొంతు కోసి.. తండ్రి ఆత్మ‌హ‌త్య‌

ముగ్గురు పిల్ల‌ల గొంతు కోసి.. తండ్రి ఆత్మ‌హ‌త్య‌

ముంబై : ఓ వ్య‌క్తి అప్పుల్లో కూరుకుపోయాడు. రెక్కాడితే కానీ డొక్కాడ‌ని ఆ కుటుంబానికి క‌ష్టాలు వ‌చ్చాయి. భార్య‌తో మాట‌ల్లేవు. కుటుంబం కూడా అత‌న్ని దూరం చేసింది. దీంతో త‌న పిల్ల‌ల గొంతు కోసి అత‌ను ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ హృద‌య విదార‌క ఘ‌ట‌న మ‌హారాష్ర్టలోని న‌లాసోప‌రా ఏరియాలో శ‌నివారం చోటు చేసుకుంది. 

కైలాష్ ప‌ర్మార్ అనే 40 ఏళ్ల వ్య‌క్తికి భార్య, ముగ్గురు పిల్ల‌లు ఉన్నారు. ముగ్గురిలో ఒక‌రు ప‌దేళ్ల కుమారుడు, ఇద్ద‌రు కుమార్తెలు. వారి వ‌య‌సు ఒక‌రిది 8 సంవ‌త్స‌రాలు కాగా, మరొక‌రిది ఐదు సంవ‌త్స‌రాలు. అయితే కైలాష్ అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. ఆర్థిక స‌మ‌స్య‌లు ఎక్కువయ్యాయి. భార్య‌, కుటుంబంతో గొడ‌వ‌లు ఉన్నాయి. 

ఒక వైపు అప్పులు, మ‌రో వైపు కుటుంబ సమ‌స్య‌లు.. దీంతో ఏం చేయాలో తోచ‌క.. కైలాష్ త‌న ముగ్గురు పిల్ల‌ల‌ను గొంతు కోసి చంపాడు. ఆ త‌ర్వాత అత‌ను ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న‌తో స్థానికంగా విషాదం నెల‌కొంది. 

ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు.. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


logo