శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Sep 14, 2020 , 14:33:42

పెళ్లికి అంగీకరించలేదని.. ఏకాంతంగా ఉన్న పొటోలను సోషల్‌ మీడియాలో పెట్టాడు..

పెళ్లికి అంగీకరించలేదని.. ఏకాంతంగా ఉన్న పొటోలను సోషల్‌ మీడియాలో పెట్టాడు..

సూరత్ : నిశితార్థం విరమించుకున్న బాలిక తల్లిదండ్రులపై యువకుడు పగ పెంచుకున్నాడు. ఆ కుటుంబం పరువు జజారుకిడ్చాలన్న ఉద్దేశంతో గతంలో ఆమెతో ఏకాంతంగా ఉన్నఅభ్యంతకర ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. బాధిత కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించడంతో అతడిపై గుజరాత్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. గుజరాత్‌కు చెందిన 16 ఏండ్ల బాలికకు ముంబైలోని మలాద్ శివారులోని పఠాన్‌వాడీకి చెందిన ముర్తుజా ముస్తాలి వోహ్రాకు గతేడాది వివాహం నిశ్చయమైంది.

జనవరిలో బాలిక మతపరమైన కార్యక్రమానికి ముంబైకి రావడంతో వోహ్రా ఆమెతో చనువు పెంచుకున్నాడు. తరచూ బాలిక ఇంటికి వెళ్లి శారీరకంగా దగ్గరయ్యాడు. ఇద్దరు ఏకాంతంగా ఉన్నప్పుడు ఆ దృశ్యాలను వీడియో తీశాడు. ఇటీవల బాలిక తల్లిదండ్రులు నిశ్చితార్థం విరమించుకోవడంతో ఆ దృశ్యాలను సోషల్‌ మీడియాలో పెట్టాడు. ఇవి వైరల్‌గా మారడంతో బాలిక కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో వోహ్రాపై సూరత్‌ జిల్లా అత్వలైన్స్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఐటీ, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo