బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Aug 21, 2020 , 14:51:16

వాడేసిన గ్లౌవ్స్‌ను వీరు ఏమి చేస్తున్నారంటే...

వాడేసిన గ్లౌవ్స్‌ను వీరు ఏమి చేస్తున్నారంటే...

ముంబై: మహారాష్ట్రకు చెందిన కొందరు దవాఖానల్లో వాడేసిన గ్లౌవ్స్‌ను సేకరించి వాటిని కడిగి తిరిగి అమ్ముతున్నారు. దీనికి సంబంధించిన ఒక ఈ ముఠాను నవీ ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. కరోనా నేపథ్యంలో చేతి తొడుగుల వినియోగం పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో కొందరు అక్రమార్కులు వాడేసిన చేతి తొడుగులను భారీగా సేకరించారు. వాటిని కడిగి శుభ్రం చేసి ప్యాక్ చేసి తిరిగి అమ్ముతున్నారు.


పావ్నేలోని ఐంఐడీసీ ప్రాంతంలో ఇలాంటి ఒక గోడౌన్ ఉన్నట్లు సమాచారం అందుకున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గురువారం రైడ్ చేశారు. దవాఖానల్లో శస్త్రచికిత్స సందర్భంలో వాడిన గ్లౌవ్స్‌ను శుభ్రం చేసి తిరిగి ప్యాక్ చేస్తున్న కొందరిని అరెస్ట్ చేశారు. ఆ గోడౌన్‌లో ఉన్న సుమారు మూడు టన్నుల మేర సేకరించిన వాడేసిన చేతి తొడుగులను సీజ్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo