మంగళవారం 19 జనవరి 2021
Crime - Oct 02, 2020 , 23:01:43

క్యాబ్ డ్రైవర్‌పై ముమైత్‌ ఖాన్‌ ఫిర్యాదు

క్యాబ్ డ్రైవర్‌పై ముమైత్‌ ఖాన్‌  ఫిర్యాదు

 హైదరాబాద్:  తనపై ఆరోపణలు చేసిన క్యాబ్‌ డ్రైవర్‌ ఆర్‌ రాజుపై  నటి ముమైత్‌ ఖాన్‌   పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  క్యాబ్ బిల్లు విషయంలో డ్రైవర్‌ రాజు సోషల్‌ మీడియాలో తనపై  తప్పుడు ఆరోపణలు చేశాడని  ఆమె  ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఇటీవల గోవా  పర్యటన సందర్భంగా  తాను డ్రైవర్‌కు రూ.15వేల బిల్లు చెల్లించలేదని డ్రైవర్‌ ఆరోపిస్తున్నాడని ఆమె తెలిపింది.    

డ్రైవర్‌కు తాను డబ్బు బాకీ లేనని, మొత్తం బిల్లును చెల్లించానని ముమైత్‌ చెప్పారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన  డ్రైవర్‌ రాజుపై  చర్యలు తీసుకోవాలని  పోలీసులను కోరినట్లు ఆమె వివరించారు.  ముమైత్‌ ఖాన్‌ ఫిర్యాదును  స్వీకరించామని,  అందులోని వాస్తవాలను ధ్రువీకరించే పనిలో ఉన్నామని పోలీసులు తెలిపారు.  కేసును దర్యాప్తు చేసి ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.  తన క్యాబ్‌లో గోవా  వెళ్లొచ్చిన ముమైత్‌ 15 వేల వరకు బాకీ ఉన్నదని   డ్రైవర్‌ మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే.